పతనానికి దగ్గర్లో టీఆర్ఎస్.. మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

by Disha Web |
పతనానికి దగ్గర్లో టీఆర్ఎస్.. మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, మంథని: ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేసే కేసీఆర్ ప్రభుత్వం పతనానికి దగ్గరలో ఉందని బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని అయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తూ.. తామే చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారని తెలిపారు. అనంతరం సునిల్ రెడ్డి మాట్లాడుతూ.. మంథని ప్రాంతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన పనులు శూన్యమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసింది శ్రీధర్ బాబు అని, పుట్ట మధు ఏ రోజూ తెలంగాణకి మద్దతు ఇవ్వలేదన్నారు. ఈ అవినీతి, అరాచక పాలనకి చరమ గీతంపాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేల్పుల రాజు, గ్రామశాఖ అధ్యక్షులు శైలేటి బాపు, మండలం ప్రధాన కార్యదర్శులు వీరావేన రాజేందర్, తోట మధుకర్, సీనియర్ నాయకులు సత్య ప్రకాష్, నాంపల్లి రమేష్, టౌన్ ప్రెసిడెంట్ ఎడ్ల సదాశివ, చిలువేరి సతీష్, సబ్బాని సంతోష్, పోతారవేణి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.


Next Story