- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి: మాజీ ఎంపీ డిమాండ్
బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయం బాలసముద్రంలో ఆదివారం ఉద్యోగ కార్మిక హక్కుల సాధన కోసం జిల్లా స్థాయి సదస్సును నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయం బాలసముద్రంలో ఆదివారం ఉద్యోగ కార్మిక హక్కుల సాధన కోసం జిల్లా స్థాయి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boianapalli Vinod Kumar) పాల్గొని ప్రసంగించారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయబోమని తెలంగాణ సర్కారు తీర్మానించాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉద్యోగుల, కార్మికల పొట్టకొడుతోందని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్డ్ బెనిఫఫిట్స్ సైతం చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాల కారణంగా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. అనంతరం ఈ సదస్సులో పలు తీర్మానాలు చేశారు.
సదస్సు చేసిన 10 తీర్మానాలు..
1. బేషరతుగా 4 నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలి, 29 పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి
2. కార్మిక హక్కుల కోసం పోరాడిన పోస్టల్ డిపార్టమెంట్ జాతీయ నాయకుడు మహదేవయ్యను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
3. రాష్ట్రంలోని లేబర్ కోర్టుల్లో ట్రిబ్యునల్స్‌ని పునరుద్ధరించాలి, పూర్తి స్థాయి న్యాయమూర్తులను నియమించాలి
4. పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్‌లను వెంటనే విడుదల చేయాలి, కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించాలి
5. తెలంగాణ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలు రూ.12 వేల భృతి, ఆటో కార్పొరేషన్, చనిపోయిన ఆటో కార్మికులకు ఎక్స్‌గ్రేషియా అందించాలి
6. షాపింగ్ మాల్స్‌లో పని చేస్తున్న కార్మికులకు మౌలిక వసతులు, ఉద్యోగ రక్షణ కల్పించాలి
7. కేంద్ర, రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలి
8. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి
9. అన్ని కార్మిక సంఘాలు ఆర్థిక పరిపుష్టి కోసం పరస్పర సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి
10. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై పునరాలోచించాలి... ఫిల్డ్ అసిస్టెంట్స్ వేతనాలు పెంచాలి, ఉపాధి హామీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి, నూతన నియామకాలు చేపట్టాలి.






