- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా..?
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సిట్ నోటీసు ఇవ్వడాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కి సిట్ నోటీసు ఇవ్వడాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boianapalli Vinod Kumar) తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసి, శాంతియుత ప్రజా ఉద్యమల ద్వారా కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కి నోటీస్ ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదని వినోద్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా..? అని వినోద్ కుమార్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆచరణలో అమలు చేయలేక పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను నోటీస్‌ల పేరిట బెదిరించే యత్నం చేస్తే భయపడేది లేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. అగ్రసేన్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశాయి. ప్రభుత్వానికి, సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.






