- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలాజీ లేఔట్‌లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆదివారం గాజులరామారం సర్కిల్ పరిధిలోని బాలాజీ లేఔట్ కాలనీలో పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు.

దిశ, కుత్బుల్లాపూర్ : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆదివారం గాజులరామారం సర్కిల్ పరిధిలోని బాలాజీ లేఔట్ కాలనీలో పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. కాలనీలోని అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా తదితర మౌలిక సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఓక్షిత కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను వివరిస్తూ కూన శ్రీశైలం గౌడ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బుచ్చి రెడ్డి, కాలనీవాసులు అంజన్న, శ్రీనివాస్, వెంకట అప్పన్న, వెంకటరెడ్డి, శేఖర్, కృష్ణ, వెంకట్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సురప రాజు, అనిల్, సలీం తదితరులు పాల్గొన్నారు.






