మున్సిపాలిటీ నియామక కుంభకోణం కేసులో మాజీ మంత్రి సుజిత్ బోస్ అరెస్ట్

by Malleboina Mahesh |

మున్సిపాలిటీ నియామక కుంభకోణంలో బెంగాల్ మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచేందుకు తరలించారు.

మున్సిపాలిటీ నియామక కుంభకోణం కేసులో మాజీ మంత్రి సుజిత్ బోస్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అధికారులు (ED officials) మున్సిపాలిటీ నియామక కుంభకోణం కేసులో మాజీ మంత్రి సుజిత్ బోస్ (Sujit Bose) ను అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు, ఈరోజు ఉదయం బిధాన్‌నగర్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం భారీ భద్రత నడుమ ఆయనను కోర్టులో హాజరు పరిచేందుకు తరలించారు.

రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో ఉద్యోగాల భర్తీలో భారీగా నగదు చేతులు మారిందనే ఆరోపణలపై గత కొంతకాలంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. గతంలో సుజిత్ బోస్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు, కీలక పత్రాలను సేకరించారు. నియామక ప్రక్రియలో ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించడంతోనే ఈ అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే, ఈ అరెస్ట్‌ను రాజకీయ కక్ష సాధింపు చర్యగా తృణమూల్ కాంగ్రెస్ అభివర్ణిస్తుండగా, అవినీతికి పాల్పడిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని సీఎం నేత సువేందు అధికారి పేర్కొన్నారు.

Next Story