- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంచల్‌గూడ జైల్లో బాల్క సుమన్‌ను పరామర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బీఆర్ఎస్ మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నాయకుడు బాల్క సుమన్‌ను మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గురువారం చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించారు.

దిశ, చంపాపేట్: బీఆర్ఎస్ మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నాయకుడు బాల్క సుమన్‌ను మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గురువారం చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ములాఖత్ ద్వారా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ ఆరోగ్య పరిస్థితి, జైలులోని వసతులు, ఇతర పరిస్థితుల గురించి ఆమె ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. బాల్క సుమన్‌కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని, సత్యం చివరకు గెలుస్తుందని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరామర్శ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు, న్యాయవాదులు కూడా హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడగా, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.






