- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీని NTR ఎందుకు స్థాపించారో అందరికీ తెలుసు: మాజీ మంత్రి
రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల తీర్పు స్పష్టంగా ఉండబోతున్నదని.. రేవంత్‌రెడ్డికి రాజకీయ బహిష్కరణ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల తీర్పు స్పష్టంగా ఉండబోతున్నదని.. రేవంత్‌రెడ్డికి రాజకీయ బహిష్కరణ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో అవినీతి, అహంకారానికి ప్రతీక అయిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ జెండాలను, గద్దెలను కూల్చాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమైనవి, ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీ గుర్తులు, జెండాలు, కార్యాలయాలపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ దర్బార్‌లో బానిసలా చూసిన కాంగ్రెస్ రాజకీయ సంస్కృతిని బొందబెట్టాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సంగతి తెలుగు ప్రజలకు తెలుసని వెల్లడించారు. దేశాన్ని ఏళ్ల తరబడి దోచుకున్న కాంగ్రెస్ అహంకారానికి, ప్రాంతీయ పార్టీ శక్తి ఏంటో దేశానికి చూపించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
మహా నాయకుడు కేసీఆర్
అదే స్ఫూర్తితో, తెలంగాణ ప్రజలను బానిసలుగా చూసిన సీమాంధ్ర రాజకీయ శక్తులతో పోరాడి భారతదేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, రాష్ట్రాన్ని సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో చంద్రబాబునాయుడు ఢిల్లీలో ధర్నాలు చేస్తూ అడ్డుపడ్డ విషయాన్ని తెలంగాణ ప్రజలు మరచిపోలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడ్డ చంద్రబాబును, ఇక్కడి ప్రజలు రాజకీయంగా బహిష్కరిస్తే ఏపీకి తరలిపోయిన టీడీపీపై రేవంత్‌కు ఎందుకింత ప్రేమ అనేది తెలంగాణ మేధావి లోకం ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో టీడీపీ జ్ఞాపకాలను రేవంత్‌రెడ్డి విడిచిపెట్టలేకపోయారని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పే కాంగ్రెస్‌లో ఉంటూనే, బీజేపీతో పొత్తు ఉన్న టీడీపీకి భజన చేయడం ఏమిటో కాంగ్రెస్ శ్రేణులు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గల్లీలో చంద్రబాబు, ఢిల్లీలో మోడీ జపం చేస్తూ, వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రేవంత్‌రెడ్డి గతాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని తెలిపారు.






