గన్ వదిలి 'లా' పట్టనున్న మాజీ మావోయిస్టు నేత దేవ్‌జీ..!

by Malleboina Mahesh |   (  Updated:2026-05-19 07:04:35  IST  )

మాజీ మావోయిస్టు నేత దేవ్‌జీ ఇంటర్ పరీక్ష రాసిన వారం రోజులకే లాసెట్ రాశారు. పేదలకు సేవ చేసేందుకు ఆయన లాయర్ కావాలని నిర్ణయించుకున్నారు.

గన్ వదిలి లా పట్టనున్న మాజీ మావోయిస్టు నేత దేవ్‌జీ..!
X

దిశ, వెబ్ డెస్క్: దిశ, డైనమిక్ బ్యూరో : విప్లవ ఉద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టు దేవ్ జీ.. ‘లా’ చదివేందుకు సిద్ధమవుతున్నారు. 1981-82 విద్యా సంవత్సరంలో కోరుట్ల జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఈయర్ చదువుతున్న సమయంలో అన్ని సబ్జెక్టుల పరీక్షలు రాసిన దేవ్ జీ తెలుగు పరీక్షను మాత్రం ఏదో ఘటనకు నిరసనగా బహిష్కరించారు. ఆయ తర్వాత ఆయన అప్పటి పీపుల్స్ వార్ పార్టీలోకి ఫుల్ టైమర్ గా వెళ్లారు. 1984 ప్రారంభంలో దండకారణ్యం వెళ్లారు. అసంపూర్తిగా మిగిలిపోయిన తన విద్యను పూర్తి చేయాలనే సంకల్పంతో ఇటీవల ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి పొందిన దేవ్‌జీ ఈ నెల 13న జరిగిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యారు.

న్యాయవాది కావాలనే ఆకాంక్షతో..

సమాజంలోని పేద, అణగారిన వర్గాలకు న్యాయపరమైన సహాయం అందించాలనే బలమైన ఆకాంక్షతో దేవ్‌జీ న్యాయవాది కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆయన లాసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకొని నిన్న జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో క్వాలిఫై అయితే.. ఇంటర్ ఫలితాలు రాగానే ఈ విద్యాసంవత్సరం నుంచే ఆయన ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరనున్నారు.

Next Story