సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో మాజీ IPS భార్య

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-10 11:56:16  IST  )

సైబర్ మోసాలు, దొంగతనాలు, క్రైమ్‌‌‌ల మీద ప్రజలను ఎడ్యూకేట్ చేయాల్సిన పోలీస్ అధికారి కుటుంబం భారీగా మోసపోయింది.

సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో మాజీ IPS భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ మోసాలు(Cyber Crime), దొంగతనాలు, క్రైమ్‌‌‌ల మీద ప్రజలను ఎడ్యూకేట్ చేయాల్సిన పోలీస్ అధికారి కుటుంబం భారీగా మోసపోయింది. అత్యాశకు పోయిన ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య(Former IPS officer's wife) ఉన్నదంతా పోగొట్టుకున్నది. వివరాల్లోకి వెళితే.. స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌లో చిట్కాలు చెబుతామంటూ తొలుత ఆమెకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌ సందేశం పంపించారు. ఆ తర్వాత నమ్మించేందుకు వాట్సప్‌లో నకిలీ సర్టిఫికెట్లు పంపించారు. దీంతో సైబర్‌ నేరగాళ్ల ప్రకటనలు నమ్మి డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వరకు మాజీ ఐపీఎస్‌ భార్య లావాదేవీలు నిర్వహించారు. ఇలా కేవలం పరిరోజుల్లో రూ.2.58 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టించారు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

READ MORE .....

సంక్రాంతికి ఊరెళ్తున్నారా?.. నగర ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

Next Story