- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతికి ఊరెళ్తున్నారా?.. నగర ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలకు పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలకు పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగకు ఊర్లకు వెళ్లే వారు ఇంటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పండుగ వేళ తాళం వేసి ఉన్న ఇళ్లపైనే దొంగల కన్ను ఉంటుందని హెచ్చరించారు. శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన సీపీ సజ్జనార్, నగదు, విలువైన ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. అలాగే సోషల్ మీడియాలో ప్రయాణానికి సంబంధించిన అప్‌డేట్స్ పోస్టు చేయవద్దని, ఇంటి వద్ద ఎవరూ లేరని దొంగలకు సంకేతాలు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఊరు వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. ‘మీ భద్రతే మా బాధ్యత’ అంటూ నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
యాడ అమ్మినా ఊరుకోకండి..
అదే సమయంలో మరో ట్వీట్‌లో చైనీస్ మాంజాపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘చైనీస్ మాంజా యాడ అమ్మినా ఊరుకోకండి. పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి. మీరు కొనకండి, పక్కవాళ్లను కూడా కొననివ్వకండి’ అంటూ స్పష్టం చేశారు. చైనీస్ మాంజా కేవలం దారం కాదని, అది మనుషుల పాలిట యమపాశమని, పక్షుల గొంతు కోసే రక్కసి అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిషేధించిన చైనీస్ మాంజాను వాడితే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
READ MORE .....






