పేద విద్యార్థులకు మాజీ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం

by Kema Shiva Kumar |

ఇద్దరు పేద విద్యార్థుల చదువు కోసం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం ఆర్థిక సాయం అందజేశారు.

పేద విద్యార్థులకు మాజీ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇద్దరు పేద విద్యార్థుల చదువు కోసం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం ఆర్థిక సాయం అందజేశారు. విద్యుత్ ప్రమాదంలో ఇటీవల మరణించిన ఎర్రవెల్లి గ్రామ నివాసి పేద రైతు చిన్రాజు సత్తయ్య కొడుకు నవీన్ స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో పేద రైతు పెద్దోళ్ల సాయిలు కొన్నేళ్ల క్రితం ప్రమాదశాత్తు చనిపోయాడు. ఆయన కొడుకు అజయ్‌ ఇంజినీరింగ్ చదువు పూర్తికాలపు ఫీజులను కేసీఆర్ చెల్లించారు. వారికి అవసరమయ్యే పుస్తకాలు, కంప్యూటర్ల కోసం కూడా ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు వారికి విడివిడిగా చెక్కులు అందించారు. ‘కష్టపడి మంచిగా చదువుకోండి బిడ్డా.. మీరు కష్టపడి గొప్ప స్థాయిని చేరుకోవాలె. మీరు.. ఫీజుల కోసం భయపడొద్దు. యే సమస్య వచ్చినా నేనున్న..’ అంటూ భరోసానిచ్చారు. విద్యుత్ ప్రమాదంలో మరణించిన సత్తయ్య కుటుంబానికి విద్యుత్ శాఖ నుంచి వచ్చే ఆర్థిక తదితర సాయం గురించి పర్యవేక్షించి వారికి న్యాయం జరిగేలా చూడాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్‌ రెడ్డిని ఆదేశించారు.

Next Story