- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండుగ పూట జర్నలిస్టుల అరెస్ట్ పై మాజీ సీఎం జగన్ ఫైర్
తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టులపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా ఖండించారు.

దిశ, వెబ్ డెస్క్: మహిళా ఐఏఎస్ పై తప్పుడు వార్తలు ప్రచారం చేసిన కేసుపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు నిన్న రాత్రి నుంచి అరెస్టులు ప్రారంభించారు. ఈ క్రమంలో పలువురు జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో జర్నలిస్ట్ సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు పోలీసులు, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ (Former CM Jagan) స్పందిస్తూ.. ఫైర్ అయ్యారు.
పండుగ వేళ ఎన్‌టీవీ (NTV) జర్నలిస్టుల ఇళ్లలోకి అర్ధరాత్రి వేళ బలవంతంగా చొరబడి, తలుపులు పగులగొట్టి వారిని అరెస్టు చేయడాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. కనీస ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, చట్టపరమైన నిబంధనలను పాటించకుండా పోలీసులు ఇలా అక్రమంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని జగన్ అన్నారు. జర్నలిస్టులను నేరస్థులుగా, ఉగ్రవాదులుగా పరిగణించి ఇంత కఠినంగా వ్యవహరించడం ప్రభుత్వం యొక్క నిరంకుశ ధోరణిని ప్రతిబింబిస్తోందన్నారు.
ఈ అనాలోచిత చర్యల వల్ల బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతుండటమే కాకుండా, మీడియా వర్గాల్లో ఒక రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అరెస్టయిన జర్నలిస్టులను విడుదల చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని, రాజ్యాంగం కల్పించిన పత్రిక స్వేచ్ఛను గౌరవిస్తూ, చట్టబద్ధమైన పాలనను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని మాజీ సీఎం జగన్ తన ట్వీట్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా ఈ వ్యవహారంలో జర్నలిస్టుల అరెస్టులపై స్పందించిన సీపీ సజ్జనార్.. విచారణకు సహకరించకుండా పారిపోతున్నారని అందుకే ఇలా వ్యవహరించామని చెప్పుకొచ్చారు.






