అత్యాచారం కేసు.. మాజీ సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

by Malleboina Mahesh |

అత్యాచారం కేసులో వినుకొండ మాజీ సీఐ చిన్నమల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.

అత్యాచారం కేసు.. మాజీ సీఐ చిన్నమల్లయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళపై అత్యాచారం చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్నాడు జిల్లా వినుకొండ మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) చిన్నమల్లయ్యకు (Chinnamalaya) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ షాక్ తగిలింది. ఈ కేసులో అరెస్టు కాకుండా మినహాయింపు ఇవ్వాలని ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ (Anticipated Bail) పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాధితురాలి నుంచి అందిన ఫిర్యాదు, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. నిందితుడికి ఊరట ఇచ్చేందుకు నిరాకరించింది.

ఇంట్లోకి చొరబడి తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, చంపుతానని బెదిరించారంటూ బాధిత మహిళ వినుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇప్పటికే చిన్న మల్లయ్య పై సస్పెన్షన్ వేటు వేశారు. కేసు నమోదైన విషయాన్ని తెలుసుకుని పరారైన మాజీ సీఐ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఆయనను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారనే అంశంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Next Story