- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నం.7 అందుకే నాకు స్పెషల్: రీజన్ రివీల్ చేసిన ఎంఎస్ ధోనీ
న్యూఢిల్లీ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జెర్సీ నంబర్ గురించి అడిగితే.. క్రికెట్ అభిమానులు ఎవరైనా ఆలోచించకుండా నం.7 అని టక్కున చెబుతారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ధోనీ అడుగుపెట్టినప్పటి నుంచి నం.7 ఉన్న జెర్సీతోనే భారత్ తరఫున ఆడాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదే నంబర్ జెర్సీతో కొనసాగుతున్నాడు. అయితే, ధోనీ నం.7 ఉన్న జెర్సీని మాత్రమే ఎందుకు ధరిస్తాడు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. తాజాగా తాను నం.7 ఉన్న జెర్సీని ధరించడానికి గల కారణాన్ని ధోనీ రివీల్ చేశాడు. ధోనీ మాట్లాడిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన అధికారిక యూట్యూబ్ చానెల్‌లో పోస్టు చేసింది. చాలామంది అది తన లక్కీ నంబర్ అనుకుంటారని, కానీ అలాంటిదేమీ లేదని పేర్కొన్నాడు. ' ఆ నంబర్ ఎంచుకోవడానికి చాలా సింపుల్ రీజన్. అది నేను పుట్టిన రోజు తేదీ. నేను జూలై(7వ నెల) 7న జన్మించాను. ఏ సంఖ్య మంచిది అనే విషయాలను ఏం ఆలోచించకుండా నేను పుట్టిన తేదీనే ఎంపిక చేసుకున్నా' అని ధోనీ తెలిపాడు. అయితే, నం.7 జెర్సీ ఎందుకు ధరిస్తున్నావని ఎవరైనా అడిగితే చాలా సమాధానాలు చెప్పేవాడినని ధోనీ పేర్కొన్నాడు.
'చాలా మంది నం.7ను న్యూట్రల్ సంఖ్య అని చెప్పేవారు. అది నాపై మంచిగానీ, చెడుగానీ ఎలాంటి ప్రభావం చూపదని చెప్పేవారు. ఈ సమాధానాన్ని కూడా నేను వేరే వాళ్లకు చెప్పేవాడిని. అయితే, ఈ విషయంలో నేను మూఢనమ్మకంగా ఏం లేను. ఆ నంబర్ నాకు నచ్చింది. అందుకే దానితోనే కొనసాగుతున్నా' అని ధోనీ చెప్పుకొచ్చాడు. కాగా, 2020లో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు సారథ్యం వహిస్తున్న ధోనీ గతేడాది ఆ జట్టును చాంపియన్‌గా నిలబెట్టి నాలుగోసారి టైటిల్ కట్టబెట్టాడు. ఐపీఎల్-15 సీజన్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుండగా.. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌తో తలపడనున్నది.