- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు కన్నుమూత
BCCI మాజీ అధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్ బింద్రా ఆదివారం రాత్రి కన్నుమూశారు.

దిశ, వెబ్ డెస్క్ : BCCI మాజీ అధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్ బింద్రా ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 82 ఏళ్ల బింద్రా.. చండీగఢ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బింద్రా 1999–2002 మరియు 2005–2008 మధ్య BCCI అధ్యక్షుడిగా పనిచేసి, భారత క్రికెట్ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల వెనుక ఆయన కీలక పాత్ర పోషించారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్థాపకుల్లో ఒకరైన బింద్రా.. ఆయన పేరుతోనే మొహాలీలోని PCA స్టేడియం ఏర్పాటు చేసారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న IPL ఆలోచనలకు మద్దతిచ్చిన వాళ్లలో ఆయన కూడా ఉన్నారు. బింద్రా మృతిపై BCCI అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జయ్ షా, పలువురు మాజీ క్రికెటర్లు, పంజాబ్ ప్రభుత్వం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఇది భారత క్రికెట్‌కు తీరని నష్టం అని పేర్కొన్నారు.






