కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి: బీఏఐ మాజీ అధ్యక్షుడు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో మూడేళ్ల నుంచి వివిధ శాఖల పరిధుల్లో చేపట్టి, పూర్తయిన పనులకు సంబంధించి దాదాపు రూ.20వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఏఐ) మాజీ అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డీవీఎన్‌ రెడ్డి తెలిపారు.

కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి: బీఏఐ మాజీ అధ్యక్షుడు
X

దిశ, నల్లగొండ బ్యూరో: రాష్ట్రంలో మూడేళ్ల నుంచి వివిధ శాఖల పరిధుల్లో చేపట్టి, పూర్తయిన పనులకు సంబంధించి దాదాపు రూ.20వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఏఐ) మాజీ అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డీవీఎన్‌ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక వెంకట రమణ గ్రాండ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ చేసి అనంతరం వారు మాట్లాడారు. ఈ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం మూడేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలోని మీడియా సెంటర్‌ దగ్గర పలువురు కాంట్రాక్టర్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

కాంట్రాక్టర్లు అప్పులు చేసి మరీ పనులు చేశారని, చెల్లింపులు ఆగిపోవడంతో అప్పు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. చాలా కంపెనీలు మూత పడే పరిస్థితి ఉందని, కొంతమంది కాంట్రాక్టర్లు ఒత్తిడితో గుండెపోటుకు గురయ్యారని, కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారని వివరించారు. పనులు చేసిన ప్రకారంగా పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌ బిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 18న రాష్ట్రంలోని కాంట్రాక్టర్లంతా కలిసి హైదరాబాద్‌లో ‘మహాసభ’ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ మహాసభలో తదుపరి కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ప్రతీ నెల చెల్లింపులు చేసినట్లుగా.. ఇప్పుడు కూడా శాఖల వారీగా బిల్లులు చెల్లించాలని కోరారు. రాష్ట్ర వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాసరావు, కోశాధికారి సంతోష్ రెడ్డి నల్గొండ సెంటర్ చైర్మన్ బి.శ్రీనివాస్ రెడ్డి ఎస్.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Next Story