- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Four Stars of Destiny: మాజీ ఆర్మీ చీఫ్ ఆత్మకథ లీక్.. ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం!
భారత పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తున్న 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తున్న 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' ('Four Stars of Destiny') పుస్తకం ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ (Former Indian Army Chief General) ఎం.ఎం. నరవణే (M.M. Naravane) రచించిన ఈ బుక్ అధికారికంగా విడుదల కాలేదు. కానీ ఆ పుస్తకం ప్రీ-ప్రింట్ కాపీలు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, న్యూస్ ఫోరమ్‌లలో అనధికారికంగా చలామణి అవుతున్నట్లు ఢిల్లీ పోలీసులు (Delhi Police) గుర్తించారు. దీనిపై కఠిన చర్యలు చేపట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉంటే.. సంబంధిత అధికారుల నుండి 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తక ప్రచురణకు ఇంకా అవసరమైన అనుమతులు లభించాల్సి ఉండగానే, ఇలాంటి లీకేజీలు జరగడంపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీ పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో, 'పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' ('Penguin Random House India Private Limited') సిద్ధం చేసినట్లుగా భావిస్తున్న ఈ పుస్తకానికి సంబంధించిన పీడీఎఫ్ (PDF) కాపీలు కొన్ని వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నట్లు తేలింది. మరికొన్ని ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు (Online marketing platforms) ఈ పుస్తకం ఇప్పటికే అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లుగా కవర్ పేజీని ప్రదర్శిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమతి లభించని పుస్తకం ఈ విధంగా బయటకు రావడం తీవ్రమైన భద్రతా ఉల్లంఘనగా (Breach) పరిగణిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు విచారణను ఢిల్లీ పోలీసు విభాగంలోని అత్యంత శక్తివంతమైన విభాగం 'స్పెషల్ సెల్' ('Special Cell')కు అప్పగించారు. ఈ లీకేజీ వెనుక ఎవరున్నారు? ముద్రణకు ముందే పీడీఎఫ్ కాపీలు ఆన్‌లైన్‌లోకి ఎలా వచ్చాయి? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. త్వరలోనే ఈ లీకేజీకి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా ఈ బుక్ లోని పలు అంశాలపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్ సభలో పదే పదే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తాజా పరిణామం సంచలనంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.






