TG: మరో ఫుడ్ పాయిజన్ ఘటన.. 32 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో మరో స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది.

TG: మరో ఫుడ్ పాయిజన్ ఘటన.. 32 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో స్కూల్‌లో ఫుడ్ పాయిజన్(Food Poisoning) ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియా తండా ప్రభుత్వ ప్రెమరీ పాఠశాల(Bodia Thanda Government Primary School)లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం అనంతరం సుమారు 32 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి మొదలయ్యాయి. విషయం తెలుసుకున్న స్కూల్ టీచర్స్ చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో తరచుగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండ్రోజుల క్రితమే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇది మరువకముందే ఖమ్మంలో ఫుడ్ పాయిజన్ జరుగడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రభుత్వ పాఠశాలలు మరియు హాస్టళ్లలో మెస్ నిర్వహణ, ఆహార నాణ్యతపై అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story