- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మూడు 'F' లపై ఫోకస్ పెట్టండి: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
అంతర్జాతీయ చమురు, ఎరువుల ధరల పెరుగుదల నేపథ్యంలో ఇంధనం, ఎరువులు, విదేశీ మారకం (3 Fs) పై దేశం దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ కోరారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రధాని మోడీ (Prime Minister Modi) హైదరాబాద్ వేదికగా పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఆ సూచనలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. దేశ ప్రజలు ఆ మూడు 'F' లపై ఫోకస్ పెట్టాలని చెప్పింది. ముంబై వేదికగా జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) దేశ ఆర్థిక పరిస్థితి, విదేశీ మారక నిల్వల (Foreign Exchange) సంరక్షణ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును ఆమె సమర్థించారు. ప్రస్తుతం దేశం "త్రీ ఎఫ్స్" (3 Fs) - ఫ్యూయల్ (ఇంధనం), ఫెర్టిలైజర్ (ఎరువులు), ఫారిన్ ఎక్స్ఛేంజ్ (విదేశీ మారకం) పై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
పశ్చిమ ఆసియా (గల్ఫ్) సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడమే కాకుండా తీవ్ర అస్థిరతకు గురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. దీంతో పాటు ఎరువులు, బంగారం ధరలు కూడా భారీగా పెరగడం వల్ల దేశ బాహ్య ఆర్థిక రంగానికి (External Front) కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. ఈ మూడు రంగాలకు సంబంధించిన చెల్లింపులు కచ్చితంగా విదేశీ మారక ద్రవ్యం (డాలర్ల) లోనే చేయాల్సి ఉంటుందని, అందుకే విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకోవాలన్న పీఎం మోదీ పిలుపును అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయంగా జీఎస్‌టీ వసూళ్లు, వాహనాల విక్రయాలు వంటి ఆర్థిక సూచికలు బలంగానే ఉన్నాయని, దేశ ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు.






