- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా నదిలో ఊపందుకున్న వరద.. బీమా మోటార్లు షురూ.. సంగంబండ, భూత్పూర్‌కు నీటి విడుదల!
కృష్ణా నదిలో ఎగువ నుంచి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండడంతో బీమా లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.

దిశ, మక్తల్: కృష్ణా నదిలో ఎగువ నుంచి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండడంతో బీమా లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. నియోజకవర్గంలో ఉన్న రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను పూర్తిస్థాయిలో నింపాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించడంతో, అధికారులు సోమవారం అర్ధరాత్రి బీమా ఫేస్-1, ఫేస్-2 పరిధిలో రెండు మోటార్లను ప్రారంభించారు.
మొత్తం 1,300 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తూ రిజర్వాయర్లకు విడుదల చేస్తున్నారు. ఇందులో సంగంబండ రిజర్వాయర్‌కు 800 క్యూసెక్కులు, భూత్పూర్ రిజర్వాయర్‌కు 500 క్యూసెక్కులు వెళ్లేలా అధికారులు పంపింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నదికి వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో నీటి లభ్యతను బట్టి పంపింగ్ పరిమాణాన్ని పెంచుతామని తెలిపారు. ఈ నీటి విడుదల కార్యక్రమంలో ఇరిగేషన్ ఇంజనీర్లు జస్వంత్, అక్షయ్, ఆపరేటర్ నరేష్, సిబ్బంది లక్ష్మణ్, కరుణాకర్ రెడ్డి, ఆశప్ప, రవి, చెన్నయ్య గౌడ్, శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ మరియు టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.






