- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామపంచాయతీలోకి వరద నీరు
జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా కొత్తగట్టు గ్రామపంచాయతీ భవనం పనికిరాని పరిస్థితికి చేరుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, శంకరపట్నం : జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా కొత్తగట్టు గ్రామపంచాయతీ భవనం పనికిరాని పరిస్థితికి చేరుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామంలో సోమవారం కురిసిన స్వల్ప వర్షానికే గ్రామపంచాయతీ కార్యాలయంలోకి వరద నీరు చేరి భవనం అపరిశుభ్రంగా మారింది. జాతీయ రహదారి–563 పై నుంచి భారీ ఉధృతితో వచ్చిన వర్షపు నీటికి గ్రామపంచాయతీ భవనం ముందు ఏర్పాటు చేసిన ఇనుప మెట్లు కూలిపోయాయి. వేగంగా ప్రవహించిన నీటితో పాటు మట్టి, ఇసుక కొట్టుకొచ్చి కార్యాలయ ముఖద్వారం వద్ద మేటలుగా పేరుకుపోయాయి. దీంతో గ్రామపంచాయతీ కార్యాలయంలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు తెలిపారు.
శాశ్వత పరిష్కారం కోరుతున్న గ్రామస్థులు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన గ్రామపంచాయతీ భవనం కంటే జాతీయ రహదారిని ఎత్తుగా నిర్మించడంతో పంచాయతీ భవనం లోతట్టు ప్రాంతంగా మారింది. ఫలితంగా వర్షం కురిసిన ప్రతిసారీ రహదారి పై నిలిచిన నీరు నేరుగా గ్రామపంచాయతీ కార్యాలయంలోకి చేరి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ భవనాన్ని ఎత్తైన ప్రదేశంలో పునర్నిర్మించడం లేదా వర్షపు నీరు కార్యాలయంలోకి చేరకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకపోతే ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని గ్రామస్థులు వాపోతున్నారు.






