ఫ్లిప్‌కార్ట్ భారీ సమ్మర్ ఆఫర్

by Muthe.Rajitha |

ఫ్లిప్‌కార్ట్ భారీ సమ్మర్ ఆఫర్ ప్రకటించింది. మే 9 నుంచి "సాసా లేలే" పేరుతో ఈ భారీ బంపర్ సేల్ మొదలవుతుందని పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్ భారీ సమ్మర్ ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ సమ్మర్ సేల్‌ను ప్రకటించింది. "సాసా లేలే" (Sasa Lele) పేరుతో నిర్వహించనున్న ఈ సమ్మర్ సేల్ మే 9 నుంచి ప్రారంభం కానుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఏసీలు, రెఫ్రిజిరేటర్లు, కూలర్లు వంటి గృహోపకరణాలపై మునుపెన్నడూ లేని విధంగా భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ఉండనున్నాయని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ సేల్‌లో మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపులు ఉండటమే కాకుండా, ఫ్యాషన్ విభాగానికి చెందిన దుస్తులు, పాదరక్షలపై 50% నుంచి 80% వరకు ఆఫర్లు లభించనున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని తెలుస్తోంది.

ధరల తగ్గింపుతో పాటు అదనపు ప్రయోజనాల కోసం HDFC, SBI, మరియు Axis బ్యాంక్ కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ సౌకర్యాలను కూడా కల్పించారు. EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. కాగా ఫ్లిప్‌కార్ట్ ప్రీమియం కస్టమర్లకు ఈ ఆఫర్లన్నీ 24 గంటల ముందే అందుబాటులోకి రానున్నాయి.

Next Story