Flipkart లో ఐఫోన్ల పై భారీ తగ్గింపులు..

by Disha Web Desk 17 |
Flipkart లో ఐఫోన్ల పై భారీ తగ్గింపులు..
X

దిశ, వెబ్‌డెస్క్: Apple ఐఫోన్లు భారతీయ మార్కెట్‌లో ఎక్కువ ధరకు లభిస్తాయి. ధర అధికంగా ఉండటం వలన వినియోగదారులు వాటిని కొనడానికి ఎక్కువగా ముందుకు రారు. కానీ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Flipkart ఐఫోన్ల పై తగ్గింపులను అందజేస్తు వినియోగదారులకు తక్కువ ధరలో Apple ఫోన్లను అందిస్తోంది. ప్రస్తుతం, Apple iPhone 11, Apple iPhone SE లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. Apple iPhone 11ని ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 32,100తో కొనుగోలు చేయవచ్చు.

Apple iPhone 11

iPhone 11 (64GB) రిటైల్ ధర రూ. 49,900. ఎక్చేంజ్ ద్వారా రూ. 17,800 తగ్గింపుతో రూ.32,100 వరకు వస్తుంది. iPhone 11,128 GB వేరియంట్ ధర రూ. 54,900. ఎక్స్చేంజ్‌తో రూ. 17,800 తగ్గింపుతో రూ.37,100 వరకు పొందవచ్చు.iPhone 11 256GB వేరియంట్ ధర రూ.64,900. ఎక్స్చేంజ్ రూ. 17,800 తగ్గింపుతో రూ. 47,100 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 11 (6.1 అంగుళాల) లిక్విడ్ రెటీనా HD డిస్‌ప్లే, A13 బయోనిక్ చిప్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.

Apple iPhone SE

iPhone SE 64GB ధర ప్రస్తుతం రూ. 30,299. ఎక్స్చేంజ్‌తో రూ.14,800 వరకు తగ్గింపుతో రూ.15,499 వద్ద కొనుగోలు చేయవచ్చు. iPhone SE 128GB వేరియంట్ ధర రూ. 35,099. ఎక్స్చేంజ్‌తో రూ.14,800 తగ్గింపు ద్వారా రూ. 20,299 వద్ద పొందవచ్చు. iPhone SE 256GB వేరియంట్ ధర రూ.45,099. ఎక్స్చేంజ్‌తో రూ. 14,800 తగ్గింపుతో రూ. 30,299 వద్ద కొనుగోలు చేయవచ్చు. iPhone SE 4.7 inch రెటినా HD డిస్‌ప్లే, A13 బయోనిక్ చిప్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.


Next Story

Most Viewed