ఒకే ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలుడు.. చెలరేగిన మంటలు

by Jakkula.Mamatha |

ఒక ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం సంభవించిన ఘటన టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఒకే ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలుడు.. చెలరేగిన మంటలు
X

దిశ, కార్వాన్: ఒక ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం సంభవించిన ఘటన టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తోపుఖాన ప్రాంతంలోని ఒక ఇంట్లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నివాసంలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు అత్యంత ధైర్య సాహసాలతో వ్యవహరించి, ఇంట్లో ఉన్న మరో మూడు గ్యాస్ సిలిండర్లను సకాలంలో బయటకు లాగేయడంతో ఒక భారీ విపత్తు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, కుటుంబ సభ్యులు తేరుకునేలోపే ఇంట్లోని గృహోపకరణాలు, విలువైన సామాగ్రి చాలా వరకు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందించినప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది గంట ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకున్నారని స్థానికులు తీవ్రంగా ఆరోపించారు. సకాలంలో స్పందించి ఉంటే ఆస్తి నష్టాన్ని మరింత తగ్గించగలిగే వారమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story