HYD: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-26 14:02:10  IST  )

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

HYD: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చైనా మాంజా(Chinese Manja)కు మరో బాలిక(Girl Dead) బలైంది. సోమవారం కూకట్‌పల్లి(Kukatpally)లోని వివేకానంద నగర్‌లో బైకుపై వెళుతున్న ఐదేళ్ల బాలిక మెడకు చైనా మాంజ చుట్టుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం అయింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండగ సమయంలో అనేకమంది చైనా మాంజా కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. ఉప్పల్ స్వరూప్ నగర్‌లో ఉంటున్న నాగరాజు మెడకు చుట్టుకుని గొంతు కోసుకుపోయింది. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా కారణంగా ఓ వృద్ధురాలు గాయపడింది. అల్మాస్‌గూడలో రోడ్డుపక్కన యాదమ్మ (70) అనే వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తుండగా కాలికి చైనా మాంజా చుట్టుకుంది. ఇలా అనేక మంది గాయాలపాలైన చైనా మాంజా అమ్మకాలు విచ్చలవిడిగా జరిగాయి. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story