- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజాబ్‌లో దారుణం.. 5గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
by Satheesh |
అమృత్‌సర్: పంజాబ్‌లో విషాదం చోటు చేసుకుంది. తోటి జవాన్ జరిపిన కాల్పుల్లో ఐదుగురు బీఎస్ఎఫ్ - latest Telugu news

X
అమృత్‌సర్: పంజాబ్‌లో విషాదం చోటు చేసుకుంది. తోటి జవాన్ జరిపిన కాల్పుల్లో ఐదుగురు బీఎస్ఎఫ్ సైనికులు మరణించారు. ఆదివారం ఉదయం అమృత్‌సర్‌లోని ఖాసా క్యాంపులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా 144వ బెటాలియన్ క్యాంపుకు చెందినవారని గుర్తించారు. ఇది దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన అని బీఎస్ఎఫ్ ప్రతినిధి పేర్కొన్నారు. మరో జవాన్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో 10 మంది గాయపడినట్లు వెల్లడించారు. 'ఇదో దురదృష్టకర ఘటన. ఖాసాలోని 144వ బెటాలియన్‌లోని కానిస్టేబుల్ సత్తెప్ప తోటి సైనికులపై కాల్పులు జరిపాడు. వీరిలో ఐదుగురు మరణించారు. వారిలో సత్తెప్ప కూడా ఉన్నాడు' అని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
Next Story






