- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాటలు పాడుకుంటూ డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు.. రోడ్డే పాటలు పాడుతుంది
డ్రైవ్ చేస్తూ పాటలు పాడుకుంటూ.. లేదా హెడ్ ఫోన్స్ లో పాటలు వింటూ వెళతారు.

దిశ, వెబ్ డెస్క్ : డ్రైవ్ చేస్తూ పాటలు పాడుకుంటూ.. లేదా హెడ్ ఫోన్స్ లో పాటలు వింటూ వెళతారు. కానీ ఒకచోట మాత్రం ఏకంగా రోడ్డే పాటలు పాడుతుంది. అలాంటి రోడ్డు ఎక్కడో కాదు మన ఇండియాలోనే ఉంది. దేశంలోనే ఇలా మొట్ట మొదటిసారి మ్యూజికల్ రోడ్డును ముంబై కోస్టల్ రోడ్డు ప్రాంతంలో నిర్మించారు. ఇపుడు ముంబై నగరానికి మరో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రాజెక్ట్‌లో ఒకటి కోస్టల్ రోడ్డు కూడా ఒకటి అనడంలో ఆశ్చర్యం లేదు. సముద్ర తీరాన్ని ఆనుకుని నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్ ముంబై నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ రహదారి నిర్మించారు. కోస్టల్ రోడ్డు వల్ల ఒక గంటకుపైగా పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో పూర్తవుతోంది.
అయితే ఈ రహదారి ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో కొంత భాగాన్ని "మ్యూజికల్ రోడ్"గా నిర్మించారు. రహదారిపై ప్రత్యేకంగా రూపొందించిన గీతలు లేదా రంబుల్ స్ట్రిప్స్ మీదుగా వాహనం ఒక నిర్దిష్ట వేగంతో వెళ్లినప్పుడు స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని "జయ హో" సంగీతం వినిపించేలా డిజైన్ చేశారు. వాహనం టైర్లు ఆ గీతలను తాకినప్పుడు ఉత్పత్తి అయ్యే కంపనాలు ఒక నిర్దిష్ట శబ్ద తరంగాన్ని సృష్టిస్తాయి. అయితే డ్రైవర్లు పరిమితి వేగంతో నడిపితేనే స్పష్టంగా ఆ సంగీతం వినిపిస్తుంది. దీని ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన పెంచడంతోపాటు, దేశభక్తిని పెంపొందించడమే ప్రధాన ఉద్దేశ్యం. వేగం ఎక్కువైతే సంగీతం సరిగా వినిపించదు. అందువల్ల డ్రైవర్లు నియంత్రిత వేగంతో ప్రయాణించేందుకు ఇది ప్రోత్సహిస్తుంది.
కోస్టల్ రోడ్డు ప్రాజెక్ట్ నిర్మాణం సాంకేతికంగా కూడా చాలా క్లిష్టమైనది. సముద్రంలో భాగంగా భూమిని అభివృద్ధి చేసి రహదారిని నిర్మించారు. దీనిలో టన్నెల్స్, ఫ్లైఓవర్లు, సముద్ర తీర రక్షణ గోడలు వంటి అనేక భాగాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల నగరంలో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా ఇంధన వినియోగం కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే కాలుష్యం తగ్గించే దిశగా కూడా ఇది సహాయపడుతుంది. ముంబై మ్యూజికల్ రోడ్డు కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, ఆధునిక ఇంజినీరింగ్‌కు ఒక ఉదాహరణ. అంతేకాదు మ్యూజికల్ రోడ్ కాన్సెప్ట్ దేశంలో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో ఇలాంటి మ్యూజికల్ రోడ్లు ఇతర నగరాల్లో కూడా నిర్మించే అవకాశం ఉందని నెటిజన్స్ భావిస్తున్నారు.






