థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు.. ఒక్కసారిగా పొగలు రావడంతో..

by Javid Pasha |

దిశ, కోదాడ : బుధవారం మధ్యాహ్నం సినిమా థియేటర్లో సినిమాను తిలకిస్తున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. Latest Telugu News..

థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు.. ఒక్కసారిగా పొగలు రావడంతో..
X

దిశ, కోదాడ : బుధవారం మధ్యాహ్నం సినిమా థియేటర్లో సినిమాను తిలకిస్తున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. థియేటర్ మొత్తం పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటన కోదాడ పట్టణంలోని శ్రీనివాస థియేటర్లో చోటు చేసుకుంది. సినిమా చూసేందుకు వచ్చిన ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. థియేటర్లో ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయిందా, లేక మంటలు వ్యాపించాయా.. అనే ఆందోళనతో ప్రజలు థియేటర్ లోపల నుండి బయటకు పరుగులు తీసేందుకు సిద్ధమయ్యారు. ప్రమాద తీవ్రతను గమనించిన యాజమాన్యం స్పందించి వెంటనే పోగలు వచ్చిన కారణాలు కనుక్కొని వెంటనే నిలుపుదల చేయడంతో ఒక్కసారిగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి స్థాయి అధికారులు తనిఖీ నిర్వహించినప్పటికీ ఈ విధంగా ప్రమాదం సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలంటూ సినిమా చూసేందుకు వచ్చిన ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Next Story