- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాసారాం స్టేషన్‌లో ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం
బిహార్‌లోని సాసారాం రైల్వే స్టేషన్‌లో పాట్నా ప్యాసింజర్ రైలులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. సిబ్బంది అలర్ట్ అవ్వడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైలు అగ్ని ప్రమాదాలు (Train fire accidents) చోటు చేసుకుంటున్నాయి. వేసవి వేడి, షార్ట్ సర్క్యూట్ ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకొని రైల్వే శాఖకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున కూడా మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బిహార్‌లోని సాసారాం రైల్వే స్టేషన్‌లో పాట్నా వెళ్లాల్సిన 'సాసారాం-పాట్నా ఫాస్ట్ ప్యాసింజర్' (భబువా-సాసారాం-పాట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్) రైలు ప్లాట్‌ఫారమ్ నంబర్ 6 పై నిలిచి ఉండగా.. ఉదయం 6 గంటల సమయంలో ఒక జనరల్ బోగీలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. బోగీలోని టాయిలెట్ భాగం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు, స్టేషన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
మంటలు క్షణాల వ్యవధిలోనే వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలతో రైలు నుండి వెలుపలికి పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న రైల్వే రక్షణ దళం (RPF), స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ టెండర్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు వ్యాపించిన సదరు బోగీని మిగతా రైలు నుండి వేరు చేసి (Detach), తీవ్ర శ్రమతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఒక బోగీ పూర్తిగా కాలిపోగా, రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తుండగా, అధికారులు పూర్తిస్థాయి సాంకేతిక విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.






