- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజస్థాన్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఉగ్రకుట్రపై అనుమానాలు!
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలో నిర్మించిన HPCL రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలో నిర్మించిన ప్రతిష్టాత్మకమైన హెచ్‌పీసీఎల్(HPCL) రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (HRRL)లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రిఫైనరీని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించి, జాతికి అంకితం చేయాల్సి ఉండగా, సరిగ్గా ఒకరోజు ముందే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. రిఫైనరీలోని క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ (CDU) సమీపంలో ఫ్లాంజ్‌ల ద్వారా హైడ్రోకార్బన్ లీకేజీ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాంట్ తోసహా చుట్టుపక్కల దట్టమైన పొగ మేఘాలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సుమారు 20 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రారంభోత్సవం వాయిదా
ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన, రిఫైనరీ ప్రారంభోత్సవం వాయిదా పడినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం, ప్రాణనష్టం సంభవించకపోవడం పెద్ద ఊరటనిచ్చే అంశం. సుమారు రూ.79,459 కోట్ల భారీ వ్యయంతో హెచ్‌పీసీఎల్ (74%), రాజస్థాన్ ప్రభుత్వం (26%) జాయింట్ వెంచర్‌గా నిర్మించిన ఈ కాంప్లెక్స్, భారతదేశంలోని అతిపెద్ద రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించగా, టెక్నికల్ నిపుణులు సేఫ్టీ చెక్కులు నిర్వహిస్తున్నారు.
ఉగ్రకోణం!
భద్రతా ప్రమాణాలను మరోసారి పూర్తిగా సమీక్షించిన తర్వాతే ప్రారంభోత్సవానికి సంబంధించిన కొత్త తేదీని వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కాగా ప్రధాని కార్యక్రమానికి ఒకరోజు ముందే ఈ ఘటన జరగడం పట్ల ఉగ్ర కుట్ర ఉంది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థలు. ఇటీవల పలు దేశాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరగడం, వాటిలో ఉగ్రవాద కోణాలు బయటకి రావడంతో.. అన్ని ఒకే ప్యాటర్న్ లో జరగడాన్ని బట్టి ఈ ఘటన కూడా ఉగ్రవాద కుట్ర కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు.






