- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
L&T ఆఫీసులో మంటలు.. కాలి బూడిదైన మేడిగడ్డ కీలక ఫైళ్లు
భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజి వద్ద ఉన్న L&T ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం చోరు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజి వద్ద ఉన్న ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థ కార్యాలయంలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ ప్రమాద తీవ్రతకు కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నిచర్‌తో పాటు బ్యారేజీ నిర్మాణానికి, డిజైన్లకు సంబంధించిన అనేక కీలకమైన డాక్యుమెంట్లు, ఫైళ్లు పూర్తిగా కాలి బూడిదైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన కొన్ని పిల్లర్లు కుంగిపోయిన ఉదంతంపై ఇప్పటికే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), విజిలెన్స్ విభాగాలు, న్యాయ కమిషన్ విచారణలు జరుపుతున్న తరుణంలో, ఈ అగ్నిప్రమాదం సంభవించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ముఖ్యంగా, కుంగిపోయిన పిల్లర్ల పునరుద్ధరణ, వాటి స్థిరత్వంపై నిపుణుల కమిటీలు క్షేత్రస్థాయిలో కీలకమైన పరీక్షలు నిర్వహిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే కార్యాలయం అధిక భాగం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఉదంతంపై స్థానిక పోలీసులు నిశితంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇది కేవలం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదమా? లేదా బ్యారేజీ విచారణకు సంబంధించిన కీలక ఆధారాలను, రికార్డులను ధ్వంసం చేసేందుకు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రా? అనే కోణంలో భద్రతా బలగాలు, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి లోతుగా విచారణ జరుపుతున్నాయి.






