- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైక్లింగ్ పార్కులో భారీ అగ్నిప్రమాదం.. లక్షల్లో నష్టం
by Javid Pasha |
దిశ, శేరిలింగంపల్లి: కొండాపూర్ బొటానికల్ గార్డెన్‌లోని సైక్లింగ్ పార్క్‌లో శనివారం రాత్రి సమయంలో.. Latest Telugu News..

X
దిశ, శేరిలింగంపల్లి: కొండాపూర్ బొటానికల్ గార్డెన్‌లోని సైక్లింగ్ పార్క్‌లో శనివారం రాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పక్కనే ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కావడంతో సైకిల్ ట్యూబ్‌లు అంటుకుని మంటలు ఎగసి పడినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ఎగిసి పడిన మంటలతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. పార్క్‌లోని సైకిల్ నిలుపు స్థలం, సైకిల్ గోదాం పూర్తిగా దగ్ధం అయింది. భారీగా మంటలు ఎగసి పడడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న మాదాపూర్ ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు 200 సైకిళ్లు దగ్ధం కాగా మరో 300 సైకిళ్లను మాదాపూర్ ఫైర్ సిబ్బంది సురక్షితంగా పక్కకు తరలించారు. దగ్ధం అయిన సైకిళ్ల విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని సిబ్బంది తెలిపారు.
Next Story






