తండ్రిని కోల్పోయిన చిన్నారికి ఆర్థిక చేయూత

by GSrikanth |
తండ్రిని కోల్పోయిన చిన్నారికి ఆర్థిక చేయూత
X

దిశ, బీర్పూర్: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామానికి చెందిన ఉయ్యాల రాజేశ్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం ఇంటిపెద్ద దిక్కును కోల్పోయి కష్టాల్లో పడింది. ఆభం శుభం తెలియని తన 8నెలల చిన్న కూతురు భవిష్యత్తు అందకారంగా మారింది. ఈ విషయం తెలిసిన ఉయ్యాల కిషన్, బెత్తెపు శేఖర్, ఆడేపు వెంకటేష్‌లు చిన్నారి భవిష్యత్తుకు అండగా నిలబడటం కోసం ఫేస్బుక్, వాట్సాప్‌లో షేర్ చేశారు. దాదాపు 120 మందికి పైగా వివిధ ప్రాంతాలవారు, స్థానికుల సహకారంతో సేకరించిన రూ. లక్ష రూపాయలను SBIలో డిపాజిట్ చేసి మిగిలిన 41,500 సుకన్య సమృద్ది యోజన పథకంలో జమ చేయించారు. చిన్నారి వైద్య సహాయార్థం రూ.10000 హెల్పింగ్ ఆర్మీ తరపున ప్రముఖ సామాజిక సేవకులు డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి(అరుణ హాస్పిటల్) చేతుల మీదుగా అందజేశారు. చిన్నారికి సహాయం చేసిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, యువత మరియు ఎల్లాల శ్రీనన్న, సేవ సమితి సభ్యులు, హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ మిత్రులు పాల్గొన్నారు.



Next Story