- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మంత్రి పొంగులేటి.. ఖమ్మం రూరల్‌లో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం!
రూరల్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలో మే 1 నుంచి మే 31 వరకు మరణించిన బాధిత కుటుంబాలకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.

దిశ , ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలో మే 1 నుంచి మే 31 వరకు మరణించిన బాధిత కుటుంబాలకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తోట వీరభద్రం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ సహాయం బాధిత కుటుంబాలకు కొంత ఊరటనిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, మాజీ ఖమ్మం మార్కెట్ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, జిల్లా నాయకుడు బండి జగదీష్ , మాజీ సర్పంచ్‌లు, ప్రస్తుత సర్పంచ్‌లు, మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బాధిత కుటుంబాలకు తమ సంఘీభావం తెలిపారు.






