వెంకటాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

by velandi.Saikiran |   (  Updated:2026-06-18 11:01:23  IST  )

వెంకటాపూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

వెంకటాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ (వెంకటాపూర్,రామప్ప): వెంకటాపూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాళ్ళపాడ్ సమీపంలో అతివేగంగా వచ్చిన ఓ టాటా ఏస్, ద్విచక్ర వాహనాన్ని (నెంబర్: AP 20 JR 1635) బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన‌దారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడి కాలు విరిగిన‌ట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో స‌మాచారం అందుకున్న‌ వెంకటాపూర్ పోలీసులు, టాటా ఏస్ వాహనాన్ని, డ్రైవర్‌ను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. బాధితుడిని ములుగు ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story