- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలి
నార్సింగి సర్కిల్-45 పరిధిలోని 126 వ వార్డులో గురువారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ విస్తృతంగా పర్యటించారు.

దిశ, గండిపేట: నార్సింగి సర్కిల్-45 పరిధిలోని 126 వ వార్డులో గురువారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ విస్తృతంగా పర్యటించారు. వార్డులో నెలకొన్న పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, ప్రజా సమస్యలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమైనా చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని తెలియజేశారు. ప్రజలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి, డీఈ శివసాయి, ఏఈ సంతోష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ లచ్చిరాం, వర్క్ ఇన్‌స్పెక్టర్లు శేఖర్, అరుణ్, వార్డు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






