నరసాపురంలో 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక

by Jakkula.Mamatha |

భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గురువారం దుమ్ముగూడెం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

నరసాపురంలో 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక
X

దిశ, దుమ్ముగూడెం: భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గురువారం దుమ్ముగూడెం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నర్సాపురం పంచాయతీలో భారీ చేరికల కార్యక్రమానికి హాజరై కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. చిన్న ఆర్లగూడెంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క ఆగ్రోస్‌ను ప్రారంభించారు. నరసాపురం గ్రామంలో వీరమాచినేని సునీల్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సమక్షంలో భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెల్లం హరిబాబు కొత్త సభ్యులకు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.

గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం చిన్న ఆర్లగూడెం, దబ్బనూతల గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. చిన్న ఆర్లగూడెం గ్రామంలో సమ్మక్క సారక్క ఆగ్రోస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండటం అవసరమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఇటువంటి కేంద్రాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమాల్లో భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తెల్లం హరిబాబు, ముర్రం వీరభద్రం, అన్నే సత్యాలు, పిలక వెంకటరమణారెడ్డి, లంక అబ్బులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story