- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతని రాక అగ్నిజ్వాలలాంటిది.. D55 టైటిల్ రివీల్ పోస్టర్‌తో సినిమాపై భారీ హైప్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ వచ్చేసింది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ వచ్చేసింది. ఆయన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మంగా రాబోతున్న ‘D-55’ టైటిల్ ఫిక్స్ చేస్తూ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘అతని రాక అగ్నిజ్వాలలాంటిది.. 'ఫస్ట్ స్ట్రైక్'- OM (ఓమ్)గా 'D55'ను పరిచయం చేస్తున్నాం’ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఒక చేత గన్, మరో చేత గొడ్డలి పట్టుకుని ప్రజలను కాపాడే ఓ కవచంలో ధనుష్‌ను పరిచయం చేశారు మేకర్స్. అలాగే అతని వెనుక జనాలు మోకాళ్లపై కూర్చుని అతనికి దండాలు పెట్టడం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ టైటిల్ రివీల్ పోస్టర్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు ‘అమరన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల, సూపర్ స్టార్ మమ్ముట్టి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.






