- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహ్మదాబాద్‌లో ఘనంగా వనమహోత్సవం
మహ్మదాబాద్ మండలం జూలపల్లి అటవీ ప్రాంతంలో గురువారం మొక్కల నాటకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

దిశ, మహ్మదాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మహ్మదాబాద్ మండలం జూలపల్లి అటవీ ప్రాంతంలో గురువారం మొక్కల నాటకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు చెట్ల పెంపకం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న హరితహారం, వనమహోత్సవం వంటి కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పెద్ద చెట్టుగా పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, అటవీ శాఖ అధికారి అబ్దుల్ హై, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం నారాయణ, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జే. రాంలాల్, మాజీ ఎంపీపీ శాంతి రంగ్యా, మాజీ కో ఆప్షన్ నెంబర్ ఈసా బస్రావి, జూలపల్లి సర్పంచ్ జి. పద్మమ్మ-నర్సింలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






