పీవీ మార్గం-యువతకు మార్గదర్శకం.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌ను సందర్శించి విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు...

పీవీ మార్గం-యువతకు మార్గదర్శకం.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌ను సందర్శించి విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. అలాగే తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా పీవీ


ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ16 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పీవీ దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 2023లో మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభించిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ విద్యార్థుల సంక్షేమానికి దోహదపడే ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని తెలిపారు. పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తుందని.. సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పోషకాహారం కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌కు అవసరమైన అదనపు తరగతి గదులు, ఆధునిక లైబ్రరీ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ట్రస్ట్ సభ్యులు, పాఠశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Next Story