- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోగా రవితేజ కొడుకు ఎంట్రీ.. ‘మారెమ్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు మాధవ్ నటిస్తున్న ‘మారెమ్మ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు యంగ్ చాప్ మాధవ్ ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. ‘మారెమ్మ’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్టుకు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు తమ ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌తో మూవీపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు అదే జోష్‌తో ఈ పవర్ ఫుల్ రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ఈసారి బోనాల జాతర థియేటర్లలో దుమ్ములేపబోతున్నాయ్.. ఈ బోనాల జాతరకు మారెమ్మతో ఒక దైవిక సినిమా వేడుక వస్తుంది.. జులై 2026 సినిమాల్లో గ్రాండ్ రిలీజ్‌కు రాబోతున్నది సిద్ధంగా ఉండండి’ అంటూ ప్రకటించారు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌లో హీరోయిన్ తలపై బోనం పెట్టుకుని ఉండగా.. తన ముందు దేవత, వెనుక జనాలు ఒక కలర్ ఫుల్ పండుగ వాతావరణంతో ఆకట్టుకుంటుంది.






