పానీ పూరి సెంటర్లలో పరిశుభ్రత పాటించాల్సిందే

by velandi.Saikiran |

పానీ పూరి సెంటర్లలో పరిశుభ్రత పాటించాల్సిందేన‌ని సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ ఆదేశించారు.

పానీ పూరి సెంటర్లలో పరిశుభ్రత పాటించాల్సిందే
X

దిశ, ఎల్లారెడ్డిపేట : పానీ పూరి సెంటర్లలో పరిశుభ్రత పాటించాల్సిందేన‌ని సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ ఆదేశించారు. గొల్లపల్లి గ్రామంలోని పానీ పూరి సెంటర్లను నిర్వహించే యజమానులను గురువారం గ్రామపంచాయతీ కార్యాలయానికి పిలిపించి సెంటర్ల వద్ద పరిశుభ్రత పాటించాలని స్థానిక సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ సూచించారు. వినియోగించే నీరు శుభ్రంగా ఉండేలా చూడటంతో పాటు, వ్యర్థ జలాలు వెళ్ళిపోయో విధంగా సరైన ఏర్పాట్లు చేయాలని, ఈగలు, దోమలు వాళ కుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే విధంగా పరిశుభ్రత లేకుండా నిర్వహిస్తున్న సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అలాంటి సెంటర్లను మూసివేస్తామని యజమానులను హెచ్చరించారు.

Next Story