ఓసీపీ-1లో 12 టన్నుల కెపాసిటీ గల ఐదు క్రేన్స్ ప్రారంభం

by velandi.Saikiran |

ఓసీపీ-1 బేస్ వర్క్‌షాప్‌లో 12 టన్నుల సామర్థ్యం గల ఐదు నూతన హైడ్రాలిక్ క్రేన్ల ప్రారంభానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

ఓసీపీ-1లో 12 టన్నుల కెపాసిటీ గల ఐదు క్రేన్స్ ప్రారంభం
X

దిశ, యైటింక్లయిన్ కాలనీ: యాజమాన్యం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో యంత్ర సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని ఓసీపీ-1 బేస్ వర్క్‌షాప్‌లో 12 టన్నుల సామర్థ్యం గల ఐదు నూతన హైడ్రాలిక్ క్రేన్ల ప్రారంభానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా జీఎం మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తి సాధనకు ఉపకరించేందుకు యాజమాన్యం కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న భారీ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. యంత్రాల వినియోగంతో పాటు నిర్వహణను సైతం ప్రతి ఉద్యోగి బాధ్యతగా భావించాలని సూచించారు.

యంత్రాల వినియోగ సమయంలో నిర్దేశించిన భద్రతా నిబంధనలు, రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాల సాధనలో యంత్రాల పనితీరు అత్యంత కీలకమని, వాటి సమర్థ వినియోగం ద్వారా ఉత్పాదకతను మరింత పెంచవచ్చని పేర్కొన్నారు.నూతన హైడ్రాలిక్ క్రేన్లు అందుబాటులోకి రావడంతో నిర్వహణ, మరమ్మతు పనులు వేగవంతం కావడంతో పాటు గనుల కార్యకలాపాల సామర్థ్యం పెరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌వో టు జీఎం ఎం. రామ్ మోహన్, ఏరియా ఇంజనీర్ అత్మూరి ఉదయ భాస్కర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవీణ్ వి. ఫాటింగ్, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ ఎం. రామచంద్ర రెడ్డి, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి,జక్కుల దామోదర్ రావు, అధికారుల సంఘం అధ్యక్షులు కోల శ్రీనివాస్‌తో పాటు వివిధ యూనియన్ల ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Next Story