గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం..

by Taduka Kalyani |

నారాయణఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు.

గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం..
X

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. గురువారం నాగల్ గిద్ద మండలం ముక్టాపూర్ రాంసింగ్ తండా ఆర్ అండ్ బి రోడ్డు రూ. 1 కోటి 50 లక్షలు, పాతు తాండ కు రూ.1 కోటి , కొండ నాయక్ తండా కు రూ.1 కోటి, రామ్ చందర్ నాయక్ తండా కు రూ.1 కోటి 10 లక్షలు బీటీ రోడ్డులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామంలో రూ.25 లక్షలు,తుర్కపల్లి గ్రామంలో ఉపాధి పథకం నిధుల కింద రూ.30 లక్షల సిసి రోడ్డు, డ్రైనేజీ కాలువ నిర్మాణం కు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని కన్వెన్షన్ హల్ లో నియోజకవర్గం 8 మండలాలకు సంబంధించిన మంజూరైన లబ్ధిదారులకు 454 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ పంపిణీ చేశారు. మండలంలోని వల్లూరు గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఆలయ హరినామ సప్తహ వేడుకల్లో పాల్గొన్నారు. పీర్ల తాండ, వల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, గిరిజన తండాకు మెరుగైన రోడ్డు వసతి కల్పించడమే తమ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాంసింగ్ తండా ప్రజలు రోడ్డు సౌకర్యం లేక చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులను గమనించి, ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రిని నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులతో నాణ్యతా ప్రమాణాలతో కూడిన డాంబర్ రోడ్డును నిర్మించి, త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి డిఈఈ రవీందర్, న్యాయవాది మునిగే సంజీవ్ కుమార్, సర్పంచులు సుభాష్ చంద్రబోస్, అశోక్ చౌహన్, జ్ఞానేశ్వర్, మల్కా రెడ్డి ప్రతాప్ రెడ్డి, మామిడిపల్లి శంషాద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story