మెదక్ ఆర్టీసీ డిపోకు మేనేజర్‌ గా పరమేశ్వరి...

by Taduka Kalyani |

మెదక్ ఆర్టీసీ డిపో నూతన మేనేజర్‌ గా పరమేశ్వరి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

మెదక్ ఆర్టీసీ డిపోకు మేనేజర్‌ గా పరమేశ్వరి...
X

దిశ, మెదక్ టౌన్ : మెదక్ ఆర్టీసీ డిపో నూతన మేనేజర్‌ గా పరమేశ్వరి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న సురేఖ ను హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ఆర్టీసీ బస్ డిపో కు బదిలీ అయ్యారు. నూతన బాధ్యతలు స్వీకరించిన పరమేశ్వరి మాట్లాడుతూ ప్రయాణికులకు నాణ్యమైన, సురక్షితమైన సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. బస్సుల సమయపాలన, మెరుగైన నిర్వహణ, ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులు సమన్వయంతో పని చేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Next Story