భూపాల్ పల్లిలో సీసీఎఫ్ కార్యాలయం ప్రారంభం

by velandi.Saikiran |

హైదరాబాద్‌లోని గుర్రం గూడలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా గురువారం ప్రారంభించారు.

భూపాల్ పల్లిలో సీసీఎఫ్ కార్యాలయం ప్రారంభం
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: హైదరాబాద్‌లోని గుర్రం గూడలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సీసీఎఫ్ భవనాన్ని ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ముఖ్యమంత్రి వర్చువల్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం, జిల్లా కేంద్రంలోని నూతన కార్యాలయ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సిసీఎఫ్ ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో అటవీ శాఖ పాత్ర ఎంతో కీలకమైనదని తెలిపారు.

జిల్లాలో సిసీఎఫ్ నూతన భవనం ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు మాట్లాడుతూ వన మహోత్సవ స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. నూతన సీసీఎఫ్ భవన నిర్మాణం జిల్లా అటవీ సంపద రక్షణకు మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.అనంతరం కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే, కలెక్టర్ మరియు ఇతర అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కన్సర్వేటర్ ప్రభాకర్, డిఎఫ్ఓ నవీన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, అటవీ శాఖ సిబ్బంది ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story