- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మామిడి రైతులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ చేయూత ప్రకటన
తోతాపురి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. దిగుబడి ఉన్నా గిట్టుబాటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా తోతాపురి రైతులకు అండగా నిలబడింది..

దిశ, వెబ్ డెస్క్: తోతాపురి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. దిగుబడి ఉన్నా గిట్టుబాటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా తోతాపురి రైతులకు అండగా నిలబడింది. అదనంగా కిలోకు రూ. 4 ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో తోతాపురి రైతులు ధరల సమస్యను ఎదుర్కొంటున్నారు. దిండిగల్, కృష్ణగిరి, శ్రీనివాసపురం, చిత్తూరు మార్కెట్లలో కిలో తోతాపురి మామిడికి రూ. 5 నుంచి రూ.6 వరకు కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ చేసింది. రైతులకు గిట్టుబడి ధర లభించేలా అన్ని స్థాయిల్లో చర్యలు చేపట్టింది.
పలు కంపెనీలతోనూ చర్చలు
అటు ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, శీతల పానియాల తయారీ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. కోకాకోలా, పెప్సీ సంస్థల ప్రతినిధులతోనూ అధికారులు చర్చలు జరిపారు. అయితే వచ్చే జనవరి, ఫిబ్రవరి వరకూ కూడా నిల్వలు ఉండటం, కొనుగోళ్ల డిమాండ్లు తక్కువగా ఉండటం, సౌదీ అరేబియా, ఒమాన్ వంటి దేశాలకు ఎగుమతి తక్కువగా ఉండటమే ధరల తగ్గుదలకు కారణమని గుర్తించారు. వాటిని పర్యవేక్షించిన ప్రభుత్వం కిలో తోతాపురి రూ. 4 చెల్లించాలని నిర్ణయించింది. దీంతో తోతాపురి రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.






