ఓటు హక్కుకు భంగం కలగొద్దు : ఆర్డీవో పార్థసారథి

by Taduka Kalyani |

ప్రతి పౌరుడి ఓటు హక్కుకు ఎలాంటి భంగం కలగకుండా సమగ్ర సవరణ సర్వే (ఎస్ఐఆర్)ను నిర్వహించాలని చేవెళ్ల ఆర్డీవో పార్థసారథి రెడ్డి సూచించారు.

ఓటు హక్కుకు భంగం కలగొద్దు : ఆర్డీవో పార్థసారథి
X

దిశ, మొయినాబాద్ : ప్రతి పౌరుడి ఓటు హక్కుకు ఎలాంటి భంగం కలగకుండా సమగ్ర సవరణ సర్వే (ఎస్ఐఆర్)ను నిర్వహించాలని చేవెళ్ల ఆర్డీవో పార్థసారథి రెడ్డి సూచించారు. గురువారం మొయినాబాద్ రైతు వేదికలో తహసీల్దార్ గౌతమ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బీఎల్వోలు, సూపర్వైజర్ల శిక్షణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని, 2002 ఓటరు జాబితా ఆధారంగా పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ ఆర్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story