- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ.. కేసీఆర్‌ను కలిసిన కేటీఆర్, హరీశ్ రావు
by Kema Shiva Kumar |
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ (KCR)తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఇవాళ సాయంత్రం భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వెళ్లిన ఈ ఇద్దరు అగ్రనేతలు, గులాబీ బాస్‌తో ప్రస్తుత రాజకీయ పరిణామాల, పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ శ్రేణులకు ఇవ్వాల్సిన శిక్షణా తరగతులు, జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నద్ధంపై రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్.. కేటీఆర్, హరీశ్ రావులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయడంతో పాటు, పార్టీని క్షేత్రస్థాయి నుంచి తిరిగి పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తోంది.
Next Story






