అధ్వాన్నంగా ఉన్న రోడ్డు..ఎక్స్ వేదికగా పౌరుడి అవేదన

by velandi.Saikiran |

కేపీహెచ్ బీ కాలనీ 9వ ఫేజ్ నుంచి గోకుల్ ప్లాట్స్ మీదుగా హఫీజ్ పేట్ వెళ్ళే రహదారి దారుణంగా తయారైంది.

అధ్వాన్నంగా ఉన్న రోడ్డు..ఎక్స్ వేదికగా పౌరుడి అవేదన
X

దిశ, కూకట్ పల్లి: కేపీహెచ్ బీ కాలనీ 9వ ఫేజ్ నుంచి గోకుల్ ప్లాట్స్ మీదుగా హఫీజ్ పేట్ వెళ్ళే రహదారి దారుణంగా తయారైంది. అధికారులు పట్టించుకోక పోవడంతో ఎక్స్ వేదికగా ఓ పౌరుడు అధికారులను నిల‌దీశాడు. మీరు రోడ్డు వేస్తారా ? లేక చందాలు వేసుకుని మమ్మల్ని వేసుకోమంటారా..? అని ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా ఏకంగా సీఎం కాన్వాయ్ ను రోడ్డుపైకి పంపించాలని పోస్ట్ పెట్టాడు. కేపీహెచ్ బీ 9వ ఫేజ్ నుంచి హఫీజ్ పేట్ రోడ్డులో గత కొన్ని రోజుల క్రితం పైప్ లైన్ పనులు చేపట్టారు. రోడ్డు వేసేందుకు వెట్ మిక్స్ ఒక లేయర్ వేసి వదిలేశారు. అయితే, కంకర మాత్రం తేలి ఉండటంతో రోడ్డు గుంతలుగా మారింది. ఈ క్ర‌మంలో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో వంద ఫీట్ల రోడ్డు వేసేందుకు సీఎంసీ అధికారులు ప్రతి పాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం.

Next Story